క్రీడలు

Robin Uthappa: ‘వారిలా దారి తప్పొద్దు వైభ‌వ్‌..’ బుడ్డోడికి రాబిన్ ఊతప్ప సూచనలు!

15 ఏళ్ల పిన్న వయసులోనే భారత జాతీయ జట్టులో చోటు సంపాదించి, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక సూచనలు చేశారు. 2026 ఐపీఎల్‌లో అగ్రశ్రేణి స్కోరర్‌గా నిలిచి వార్తల్లో నిలిచిన వైభవ్, ఇటీవలి జింబాబ్వే పర్యటనలో తన నాలుగో మ్యాచ్‌లోనే తొలి అంతర్జాతీయ అర్ధశతకం సాధించి తన అసాధారణ ప్రతిభను చాటుకున్నాడు. అయితే, ఈ వేగవంతమైన ఎదుగుదల క్రమంలో వైభవ్ కెరీర్ దారితప్పకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఊతప్ప అభిప్రాయపడ్డారు.