క్రైమ్

దోచుకుందామని వెళ్లి ఫుల్లుగా తాగేసి..ఏం చేశారంటే? (వీడియో)

దొంగతనానికి వెళ్లిన దొంగలు దోచిన సొత్తును తీసుకోని వెళ్లిపోవడం కామన్. కానీ, ఇటీవల కొందరు దొంగలు దోచుకున్న చోటే కడుపు నింపుకుంటున్నారు.అదే ఇంట్లో తినడంతో పాటు తాగేసి అక్కడే తొంగుంటున్నారు. ఇదే వారిని ఊచలు లెక్కబెట్టేలా చేస్తున్నది. తాజాగా ఇలాంటి ఘటనే రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది.వివరాల్లోకివెళితే.. ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లిలో అర్థరాత్రి సమయంలో ఓ దాబాలో ఐదుగురు దుండగులు దొంగతనానికి వెళ్లారు.మొదట విలువైన సామగ్రి దోచుకుని పారిపోయిన దొంగలు.. మరల మిగిలిన సొమ్ము కోసం మళ్లీ అదే దాబాకి తిరిగొచ్చారు. అదే క్రమంలో వారికి ఈసారి అక్కడ మద్యం కనిపించింది. దీంతో మందు తాగేసి సొమ్ము దోచుకెళ్దామని దుండగులు అనుకున్నారు.కక్కుర్తి పడి మద్యం ఎక్కువగా తాగేయడంతో మత్తెక్కి దాబా ప్రాంగణంలోనే దొంగలు నిద్రపోయారు.