క్రైమ్

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

Road Accident: జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల స్టేజి సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎర్టిగా కారు వేముల స్టేజి వద్దకు రాగానే అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న ఇనుప రైలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. నేపాల్ నుండి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.