క్రైమ్

Road Accident: నల్లమలలో ఘోర రోడ్డు ప్రమాదం.. షాకిస్తున్న మరణాల నివేదికలు!..

నల్లమల ఘాట్ రోడ్డులో మంగళవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కర్నూలు నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్‌టీసీ హైటెక్ బస్సు, బొలెరో వాహనంను ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.