క్రీడలు
Rishabh Pant: సీఎంకు రిషబ్ పంత్ షాకింగ్ ట్వీట్.. అర్ధరాత్రి వేళ వింత రిక్వెస్ట్!
టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు ప్రస్తుతం తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఇల్లు కట్టుకునేందుకు సరైన భూమి కొనుగోలు చేయడంలో సాయం చేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి అర్ధరాత్రి వేళ ఆయన విజ్ఞప్తి చేశారు. తెల్లవారుజామున 12:46 గంటలకు పంత్ వరుసగా చేసిన ఈ ట్వీట్లలో విపరీతమైన స్పెల్లింగ్ తప్పులు, వ్యాకరణ దోషాలు ఉండటంతో నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు. తన నివాసాన్ని ఢిల్లీ నుంచి సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌కు మార్చాలని భావిస్తున్నానని, అయితే స్థలాన్ని కొనుగోలు చేయడం ఒక పీడకలగా మారిందని పంత్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
