National
పంత్ రిక్వెస్ట్‌కు స్పందించిన సీఎం.. అధికారులకు కీలక ఆదేశాలు!
టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో భూమి కొనుగోలు చేసేందుకు సాయం చేయాలని కోరుతూ చేసిన ట్వీట్లపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అత్యంత సానుకూలంగా స్పందించారు. ఢిల్లీ నుంచి స్థావరాన్ని మార్చుకుని సొంత మట్టిలో మొదటి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న పంత్ ఆకాంక్షను సీఎం మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందించారు. ధామి, నిబంధనలకు లోబడి పంత్‌కు పూర్తి సహకారం అందించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
