లాస్ ఏంజెల్స్‌లో అల్లర్లు.. కార్లకు నిప్పు, భారీగా ఆస్తుల ధ్వంసం
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అల్లరిమూకలు రెచ్చపోయారు.నగరంలో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ (ICE) విభాగం చేపట్టిన కఠినమైన వలస విధానాలు, దాడులకు నిరసనగా పెద్ద ఎత్తున అల్లర్లు, ఉద్రిక్తతలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. వందలాది మంది ఆందోళనకారులు డౌన్‌టౌన్ లాస్ ఏంజిల్స్‌లోని రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో భద్రతాబలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ (Metropolitan Detention Center) వెలుపల వేలాది మంది ప్రదర్శనకారులు గుమిగూడి ఫెడరల్ ఏజెంట్లపైకి రాళ్లు, సీసాలు విసిరినట్టు సమాచారం. కొందరు అల్లరిమూకలు దుకాణాల అద్దాలు పగలగొట్టి, వస్తువులను లూటీ చేసినట్టు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాలలో ఖరీదైన సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిప్పు పెట్టడంతో పాటు ప్రభుత్వ బస్సులు, భవనాలపై గ్రాఫిటీ రాసి ధ్వంసం చేసినట్టు కథనాలు వస్తున్నాయి.
