తెలంగాణ
జీవో 317 రద్దు చేయండి.. గాంధీభవన్ వద్ద హై అలర్ట్
ప్రభుత్వ టీచర్లు, ఉద్యోగులు మరోసారి భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన జీవో 317ను రద్దు చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఈ జీవోను అధికారిలోకి వస్తే రద్దు చేస్తామని, టీచర్ల అభిప్రాయాలు తీసుకుని బదిలీలు చేపడతామని నాటి పీసీసీ చీఫ్ రేవంత్ .. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చి మూడేండ్లు అయినా తమ సమస్యకు పరిష్కారం దొరకలేదని జీవో 317 బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అయిన గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
