తెలంగాణ
సిరిసిల్లలో రేవంత్ సభ.. మహిళా సంఘాలు, నేతలకు టార్గెట్లు!
రేపు సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆయన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా కరీంనగర్ నుంచి నేరుగా సిరిసిల్లలోని కళాశాల మైదానానికి సీఎం చేరుకుంటారు.ఈ క్రమంలోనే సీఎం సభకోసం జనసమీకరణకు నేతలు ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. గత వారం రోజులుగా సిరిసిల్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్ మకాం వేసినట్టు తెలుస్తోంది. భారీగా జనసమీకరణ చేయాలంటూ నేతలకు టార్గెట్లు ఇస్తున్నట్టు సమాచారం. మహిళా సంఘాలకు ప్రత్యేకంగా జనసమీకరణ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. సభకు వచ్చే మహిళలు ఇందిరమ్మ చీరలు కట్టుకొని రావాలంటూ ఆదేశాలు సైతం జారీ చేసినట్టు టాక్ వినిపిస్తోంది.
