రేవంత్ రెడ్డి నీకు నెల రోజులే టైం : టీఆర్ఎస్ చీఫ్ కవిత
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆదిలాబాద్ రిమ్స్ ఘటన మీద బుధవారం ఆమె స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆదిలాబాద్ రిమ్స్‌లో కరెంట్ షార్ట్ సర్క్యూట్, ఏసీ పేలి ఐదుగురు చిన్నారులు మరణించారని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆదిలాబాద్ సురక్ష చిల్డ్రన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ‘రిమ్స్’ ఎస్ఎన్సీయూ అగ్ని ప్రమాద ప్రమాద బాధిత శిశువుల తల్లిదండ్రులను కవిత పరామర్శించారు. అనంతరం మీడియాతో టీఆర్ఎస్ చీఫ్ కవిత మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నానని సీఎం రేవంత్ చెప్పారని, ఆయన దత్తత తీసుకున్న జిల్లాలో 5 మంది పసి పిల్లలు చనిపోతే వచ్చి చూసేందుకు తీరక లేదా? అని ప్రశ్నించారు. ఫుట్ బాల్ ఆడేందుకు, విదేశాల్లో తిరిగేందుకు మాత్రమే సీఎంకు టైం ఉంటుందన్నారు. మైనార్టీ, ఆదివాసీ పిల్లలు చనిపోతే చూడటానికి టైం లేదా? అని నిలదీశారు.
