తెలంగాణ

Revanth Reddy: జాగ్రత్త.. చేతబడి తిరగబడితే అష్టదిగ్బంధనమే..!

రాష్ట్రంలో కరవు రావాలని కొంతమంది అఘోరా పూజలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి చేతబడి పూజలు చేస్తున్నారని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు చేసే పని ఇదేనా? అని రేవంత్ ప్రశ్నించారు. చేతబడి పూజలు తిరగబడితే ఏమవుతుందో తెలుసు కదా అన్న సీఎం రేవంత్.. మీరు చేసిన చేతబడి మీపైనే తిరగబడి అష్టదిగ్బంధనం చేస్తుందని హెచ్చరించారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి వాళ్లు అఘోరా పూజలు చేసినా దేవుడు మనతోనే ఉన్నాడని రేవంత్ అన్నారు. 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన తనకుందన్నారు. రాష్ట్రం బాగు కోసం నా సంకల్పం, అందుకే వర్షాలు పడుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించారు.