తెలంగాణ

రేవంత్ రెడ్డిది పంది కంటే హీనమైన బతుకు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి నిన్న మూసారాం బ్రిడ్జి ప్రారంభోత్సవంలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘కేసీఆర్‌కు నాకు నందికి, పందికి ఉన్న తేడా ఉంది. గాడిదకు ఎంత రంగు పూసినా అది రేసుగుర్రం కాదు’ అని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘రేవంత్ రెడ్డిది పంది కంటే హీనమైన బతుకు. వెలిగొండ ప్రాజెక్టు గురించి, కృష్ణా జలాల దోపిడి గురించి మాట్లాడేందుకు ఎందుకు ఉచ్చ పడుతుంది రేవంత్ రెడ్డికి, మంత్రులకు? నీకు రాజకీయ బిక్ష పెట్టిన పాలమూరుకు ఇంత ద్రోహం చేస్తావా, మళ్లీ వలసల జిల్లాగా మారుస్తావా? తెలంగాణకు సమైక్య వాదుల కంటే ఎక్కువ ద్రోహం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇంకా సిగ్గులేకుండా కేసీఆర్ గురించి ఎలా మాట్లాడుతున్నావు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.