తెలంగాణ

వైద్యరంగాన్ని విస్మరించిన రేవంత్ రెడ్డి.. రిమ్స్ ప్రమాద ఘటనపై కేటీఆర్ విమర్శలు!

 ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆస్పత్రిలోని పీడియాట్రిక్ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ముగ్గురు పసిపాపలు ప్రాణాలు కోల్పోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన, అస్వస్థతకు గురైన మరో 23 మంది పసిపిల్లలకు ప్రభుత్వం తక్షణమే అత్యుత్తమ వైద్య సేవలుందించి వారి ప్రాణాలను కాపాడాలని సామాజిక మాధ్యమం ద్వారా విజ్ఞప్తి చేశారు.