TG: ఢిల్లీలోనే ఉండండి.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సీఎం ఆదేశాలు
TG: దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ హిట్ ఒక్కసారిగా పీక్స్‌కి చేరింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నిర్ణయాలు, వివాదాస్పద సర్ అంశాలకు వ్యతిరేకంగా విపక్ష 'ఇండియా' కూటమి చేపట్టిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, ఆ వెంటనే చెలరేగిన తొక్కిసలాటలో పలువురు తెలంగాణ ప్రజాప్రతినిధులు కిందపడి గాయపడటం కలకలం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాష్ట్ర నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో ఢిల్లీ బాట పట్టారు. అయితే సోమవారం ప్రతిపక్షాలు భారీ ఎత్తున నిర్వహించిన ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
