Revanth Reddy: ప్రమోద్ కాదు.. ప్రాపర్టీ సావంత్.. గోవా సీఎంపై రేవంత్ రెడ్డి సెటైర్!
Revanth Reddy: గోవా రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన పంచ్ డైలాగ్స్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ను నేరుగా టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి చేసిన ‘ప్రాపర్టీ సావంత్’ కామెంట్ స్థానిక రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కాక రేపింది. బీజేపీ పాలనలో గోవాలో వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమైపోతున్నాయని, ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారని ఆరోపించిన రేవంత్.. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు.గోవా పర్యటనలో భాగంగా నిర్వహించిన ‘గోయ్ రాఖోన్న్’ యాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "గోవా భవిష్యత్తును పూర్తిగా నాశనం చేశారు. యువతను డ్రగ్స్‌కు బానిసలుగా మార్చేసి, రాష్ట్రాన్ని డ్రగ్స్ పెడ్లర్లకు అడ్డాగా మార్చేశారు. రెండుసార్లు బీజేపీని నమ్మి ప్రజలు మోసపోయారు.. మూడోసారి కూడా ఆ పార్టీని నమ్మి మళ్లీ మోసపోవద్దు" అని పిలుపునిచ్చారు.
