అన్నదమ్ములతోనే రేవంత్ ఒప్పందాలు.. ఫ్యూచర్ సిటీకి భవిష్యత్ లేదు : కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.గురువారం ముఖ్యమంత్రి తమ్ముడు కొండల్ రెడ్డి కంపెనీ ‘టెసెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్’కు ఫోర్త్ సిటీలో అక్రమంగా కట్టబెట్టిన భూమి వద్దకు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు చేరుకొని పరిశీలించారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. అమెరికా పర్యటనలో సొంత సోదరులతోనే రేవంత్ రెడ్డి ఒప్పందాలు చేసుకొని పెట్టుబడులు తెస్తున్నాడని ఎద్దేవాచేశారు. ‘ది గ్రేట్ అనుముల రేవంత్ రెడ్డితో ది గ్రేట్ పారిశ్రామికవేత్త అనుముల జగదీశ్వర్ రెడ్డితో రూ.1000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాడు. ఇలా అనుముల జగదీశ్వర్ రెడ్డికి రూ.1000 కోట్లు, అనుముల కొండల్ రెడ్డికి రూ.250 కోట్లు ఇవ్వడమేనా ప్రజాపాలన.అనుముల అన్నదమ్ముల దోపిడీ గురించి బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని బీజేపీ వాళ్ళు అంటారు.. మరి దొంగని పట్టుకోవాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్కడ ఉన్నాడు’ అని ప్రశ్నించారు.
