తెలంగాణ

కొండా సురేఖ బీసీ కార్డుకు రేవంత్ సర్కార్ కౌంటర్.. ముగ్గురు బీసీ మహిళలకు కీలక పదవులు

BC Women: కాంగ్రెస్ లో కలకలం రేపిన కొండా సురేఖ ఎసిసోడ్ కు ఎండ్ కార్డ్ పడింది. కొండా సురేఖపై వేటు వేసింది హైకమాండ్. మంత్రివర్గం నుంచి ఆమెను బర్తరఫ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు చిన్నారెడ్డిపైనా వేటు వేసింది హైకమాండ్. తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించింది.

తనపై చర్యలు తీసుకుంటే బీసీలంతా ఏకమవుతారని కొండా సురేఖ కాంగ్రెస్ పెద్దలకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తనపై చర్యలను నిలువరించేలా ఆమె బీసీ మహిళ కార్డును ప్లే చేశారు. అయితే, కొండా సురేఖపై వేటు పడేలా చూడటంతో పాటు ఆమె బీసీ కార్డుకు కౌంటర్ కూడా ఇచ్చింది రాష్ట్ర నాయకత్వం. ముగ్గురు బీసీ మహిళలకు అగ్ర తాంబూలం ఇచ్చింది. వారికి కీలక పదవులు అప్పగించింది. ఒక బీసీ పదవి బర్తరఫ్ తో ముగ్గురు బీసీ మహిళలకు పదవుల్లో చోటు ఇచ్చింది.