TG : చేతులెత్తేసిన రేవంత్ సర్కార్.. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం!
రాష్ట్రంలో నీటి కొరత తీవ్రతరం అవుతున్న తరుణంలో రేవంత్ సర్కార్ చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడం, ఎండలు పెరగడంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు క్రమంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం నగరంలోని జంట జలాశయాలు, ఇతర ప్రాజెక్టుల్లోని నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని సర్కార్ నిర్ణయించింది.దీంతో నగరంలో వాణిజ్య అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సమాచారం. హైదరాబాద్లో వేసవి రాకముందే నీటి కొరత తీవ్రతరం కావడంతో ఇప్పటికే నారాయణ, శ్రీచైతన్య వంటి విద్యాసంస్థలు స్కూల్స్, కాలేజీలకు హాఫ్ డే ప్రకటించాయి. అదే బాటలో మరికొన్ని విద్యాసంస్థలు ఉన్నట్టు తెలుస్తోంది. హాస్టల్స్ నుంచి వచ్చేవారికి ముందస్తు దీపావళి సెలవుల పేరిట హాలిడేస్ ప్రకటించాయి.ఈ క్రమంలోనే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుండటంతో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సంస్థలకు ఆదేశాలు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
