రాష్ట్రంలో అమ్మకానికి గురుకుల సీట్లు?
రాష్ట్రంలో మరో సంచలన విషయం వెలుగుచూసింది. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల పాఠశాలలోని సీట్లను కొందరు అక్కమార్కులు అమ్ముకుంటున్నట్టు సమాచారం. ఈ అకడమిక్ ఇయర్లో విద్యార్థుల అడ్మిషన్లు రాక ఖాళీగా ఉన్న సీట్లను దళారుల సాయంతో అధికారులు విక్రయిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం కాస్త హాట్ టాపిక్ అయ్యింది. ప్రభుత్వ పాఠశాల సీట్లను అమ్ముకోవడం ఏంటని కొందరు విమర్శిస్తుండగా.. అర్హులైన వారికి కేటాయించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. వివరాల్లోకివెళితే.. గురుకుల సొసైటీల్లో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖాళీగా ఉన్న సీట్లను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో, నెలన్నర రోజుల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాల స్థాయిలో సరైన సమాచారం లేకపోవడంతో, అనేక జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్లోని గురుకుల ప్రధాన కార్యాలయం ఎదుట సీటు కోసం తల్లిదండ్రుల పడిగాపులు కాస్తున్నట్టు సమాచారం.
