తెలంగాణ

అంజయ్య నగర్‌లో కొనసాగుతున్న రెస్క్యూ.. ఆ కట్టడాలు కూల్చుతారా?

హైదరాబాద్‌ మహానగరంలోని మాదాపూర్ పరిధిలో ఉన్న అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల అక్రమ నిర్మాణం నిన్న కుప్పకూలిన విషయం తెలిసిందే. భవనం ఒక్కసారిగా కూలడంతో పక్కన ఉన్న అపార్ట్ మెంట్స్ సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన కార్మికులు మధ్యప్రదేశ్‌కు చెందిన టైల్స్ కార్మికులుగా గుర్తించారు.ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రెస్య్కూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. కాగా, నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి శిథిలాల తొలగింపులో ఆటంకం ఏర్పడినట్టు తెలుస్తోంది. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారా? మరణించి ఉన్నారా? అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలాఉండా, నిన్న కుప్పకూలిన బిల్డింగ్ శిథిలాలు పక్కన ఉండే జయదర్శి అపార్ట్‌మెంట్ మీద పడటంతో అది కూడా డ్యామేజ్ అయ్యింది. అయితే, దానిని కూడా ఇవాళ హైడ్రా అధికారులు కూల్చివేసే అవకాశం కూడా ఉంది.అంజయ్య నగరలో మరో నాలుగు అక్రమ కట్టడాలు ఉన్నాయని, వాటిని కూడా కూల్చుతామని నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించిన విషయం తెలిసిందే.