వ్యాపారం

క్యాన్సర్ బాధితులకు ఊరట.. 137రకాల మందుల ధరలు 70శాతం తగ్గుదల!

 క్యాన్సర్‌తో పోరాడుతూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న లక్షలాది మంది రోగులకు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది. అత్యంత కీలకమైన, ఖరీదైన 137రకాల క్యాన్సర్ నిరోధక ఔషధాల (Anti-Cancer Drugs) ప్రాథమిక ధరలపై ట్రేడ్ మార్జిన్‌ను (Trade Margin) గరిష్టంగా 30శాతానికి పరిమితం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల మార్కెట్‌లో లభించే ప్రధాన క్యాన్సర్ మందుల గరిష్ట చిల్లర ధరలు (MRP) ఏకంగా 70శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ సవరించిన నూతన ధరలు నవంబర్ 9వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి రానున్నాయి.