తెలంగాణ

బండి భగీరథ్‌కు హైకోర్టులో ఊరట.. గూగుల్, మెటా, ఎక్స్ సంస్థలకు కీలక ఆదేశాలు!

 కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన పోక్సో (POCSO) కేసుకు సంబంధించిన ఎలాంటి కంటెంట్‌ను, వార్తలను టీవీ ఛానెళ్లు, సోషల్ మీడియా వేదికల్లో ప్రసారం చేయవద్దని న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్ ధర్మాసనం గురువారం సంచలన తీర్పునిచ్చింది. సదరు కేసులో తనకు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ మంజూరైనప్పటికీ, కొన్ని టీవీ ఛానెళ్లు, ప్రైవేట్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నిరంతరం ఈ అంశాన్ని ప్రసారం చేస్తూ మీడియా ట్రయల్ నిర్వహిస్తున్నాయని భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు.