National

టోల్‌చార్జీలు తగ్గింపు.. కండిషన్స్ అప్లయ్!

జాతీయ రహదారులపై నిత్యం ప్రయాణించే వాహనదారులకు కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఫాస్టాగ్‌ ఏడాది పాస్ విధానంలో ప్రస్తుతం అమలవుతున్న వాటిలో కీలక మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. టోల్ ప్లాజాల సమీపంలో నివసించే స్థానికులకు తక్కువ ధరకే సంవత్సర పాస్ అందించేలా కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. జాతీయ రహదారి ఫీజు నిర్ధారణ, సేకరణ నిబంధనలకు సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజా నిబంధనలు నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. కమర్షియల్ వాహనదారుల ప్రయోజనాల కోసం రిజిస్టర్ అయి, ఫాస్టాగ్‌ కలిగి ఉన్న ఓనర్స్ తమ స్థానిక ప్రాంతాల్లోని టోల్ ప్లాజాల వద్ద రాయితీ పాస్‌లను పొందేందుకు అర్హులు అవుతారు.