ఉపఎన్నికకు సిద్ధంగా ఉన్నా : దానం నాగేందర్
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఘటనలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దుచేసిన విషయం తెలిసిందే.ఈ తీర్పుపై స్టే కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దానంపై అనర్హత వేటు వేయడం సరైనదే అని సర్వోన్నత న్యాయస్థానం భావించింది. సుప్రీంకోర్టులోనూ తనకు వ్యతిరేకంగా తీర్పు రావడంపై తాజాగా దానం నాగేందర్ స్పందించారు.అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. చట్టపరమైన ప్రక్రియపై గౌరవంతోనే తాను న్యాయపోరాటం చేశానని వెల్లడించారు. ఇకపై తన భవిష్యత్తును ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ‘కోర్టు తీర్పు ఈ విధంగా వస్తుందని నేను ముందే ఊహించాను. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనల ప్రకారం లీగల్గా నాకు కొంత ఊరట లభిస్తుందని భావించాను. అందుకే చట్టబద్ధంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను’ అని దానం చెప్పుకొచ్చారు.
