తెలంగాణ
పొంగులేటి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధం.. బీజేపీ ఎమ్మెల్యే సవాల్!
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాలపై తన వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు(గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈ విషయమై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చకు రాగలరా అని సవాల్ విసిరారు. పొంగులేటి అక్రమాలకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లకు త్వరలోనే అప్పగిస్తానని స్పష్టం చేశారు.
