సినిమా

RC 17-Sukumar: కొత్త మేకోవర్ ట్రై చేస్తున్న రామ్ చరణ్!

RC 17-Sukumar: ప్రస్తుతం, రామ్ చరణ్ తన 17వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సుకుమార్, ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్స్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. దాదాపు, ఈ వర్క్ పూర్తి కావచ్చింది. త్వరలో, ఘనంగా ఓపెనింగ్ నిర్వహించి రెగ్యులర్ షూటింగ్‌కి ప్లాన్ చేయనున్నారు. ఈ సినిమా కోసం చరణ్ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడట.