వ్యాపారం
RBI new rules: ఆర్బీఐ కొత్త రూల్స్.. హోమ్ లోన్ ఈఎంఐలపై డబుల్ ఎఫెక్ట్!
హోమ్ లోన్ తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీపితో పాటు చేదు లాంటి ఒక వార్త చెప్పింది. ఫ్లోటింగ్ వడ్డీ రేట్లపై రుణాలు తీసుకున్న వారి కోసం ఆర్బీఐ కొత్త నిబంధనల ముసాయిదాను సిద్ధం చేసింది. దీని ప్రకారం, బ్యాంకులు ఇకపై ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేట్లను తప్పనిసరిగా రీసెట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ కొత్త మార్పు వల్ల మీ నెలవారీ ఈఎంఐ పెరుగుతుందా? లేక తగ్గుతుందా? సాధారణ వినియోగదారులపై దీని ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం.
