వ్యాపారం

ఆర్బీఐ చర్యలు.. మరింత బలపడిన రూపాయి!

మొన్నటివరకు భారీ పతనాన్ని చవిచూసిన దేశీయ కరెన్సీ రూపీ విలువ నెమ్మదిగా పుంజుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల పరిస్థితులు, విదేశీ మారకం ద్రవ్యలోటు కూడా తగ్గుముఖం పట్టడంతో మార్కెట్‌లో భారత రూపాయి బలంగా పుంజుకుంది. గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లోనే అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ రూపీ మారకం విలువ ఏకంగా 47 పైసలు ఎగబాకింది. దీంతో ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారతీ రూపాయి విలువ 94.26 వద్ద కొనసాగుతోంది. ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్ ప్రారంభంలో 94.30 వద్ద ప్రారంభమైన రూపాయి.. కొనుగోళ్ల మద్దతుతో మరింత బలపడి 94.26 వద్దకు చేరుకుని లాభాలబాట పట్టింది. అంతకుముందు రోజు ముగింపు సమయానికి రూపాయి విలువ 22 పైసలు లాభపడి 94.73 వద్ద స్థిరపడగా, తాజా సెషన్‌లోనూ అదే సానుకూల జోరును కొనసాగించి బలాన్ని పుంజుకుంది.