చిత్రం లేదు
క్రీడలుRavichandran Ashwin: రోహిత్, కోహ్లీ ఫ్యూచర్ ప్లాన్స్‌పై అశ్విన్ క్లారిటీ!
భారత టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్ తర్వాత భవిష్యత్తుపై స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్, వీరిద్దరి కోచింగ్ ప్రయాణం ఏ విధంగా ఉండబోతోందనే దానిపై తన అంచనాలను పంచుకున్నారు. రోహిత్ శర్మ ఆట నుంచి తప్పుకున్న వెంటనే ఆయన అనుభవాన్ని, వ్యూహాత్మక చతురతను వినియోగించుకోవాలని ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు ఆయన కీలక సూచన చేశారు.
