సినిమా
Ravi Teja: 'ఇరుముడి' టైటిల్ వివాదం..రిలీజ్ ముందు మార్చేస్తారా?
Ravi Teja: ఇరుముడి సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. అయితే, ఇందులో ఉన్న యాక్షన్ సీన్స్, మర్డర్ మిస్టరీ సీన్స్ చూసి ఇప్పుడు టైటిల్ విషయంలో కొత్తగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో టైటిల్ ఎందుకు ఇరుముడి పెట్టారు. త్రిముడి అని పెట్టుకోవచ్చు కదా అంటూ కామెట్స్ చేస్తున్నారు. అయ్యప్ప దీక్ష తీసుకున్నా కూడా కొన్ని సన్నివేశాలు చూసేందుకు అభ్యంతరంగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. మరి, విడుదల ముందు టైటిల్ మార్చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
