తెలంగాణ

Ration Rice Mafia: రేషన్ ‘బినామీ’ దందా.. పేదల బియ్యం పెద్దల జేబుల్లోకి! జోగుళాంబ గద్వాల జిల్లాలో గాడి తప్పిన ప్రజా పంపిణీ వ్యవస్థ

పేదవాడి ఆకలి తీర్చాల్సిన ఉచిత రేషన్ బియ్యం.. అక్రమార్కుల జేబులు నింపుతోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) పూర్తిగా పక్కదారి పట్టింది. పేరుకేమో ప్రభుత్వం కేటాయించిన అసలు డీలర్లు.. క్షేత్రస్థాయిలో మాత్రం అంతా బినామీల హవా! రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారుల కళ్ల ముందే ఈ దందా సాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.