ఏపీ
AP: రాప్తాడు రాక్షసుడి మోకాళ్లలో కాల్చడం వెనక అసలు కారణం ఇదే.. హ్యాట్సాఫ్ అనాల్సిందే
రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో కిరాతక దాడికి పాల్పడిన ఉన్మాది కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఆదివారం ఆత్మకూరు అడవుల్లో జరిగిన పోలీస్ ఫైరింగ్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పట్టుకునే క్రమంలో నిందితుడు సీఐపై కత్తితో దాడి చేయబోయాడని, ఆత్మరక్షణ కోసమే ఆరు రౌండ్ల కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఈ మొత్తం ఘటన వెనుక అసలు వాస్తవాలేంటి? ఇది సాధారణ అరెస్ట్ ఆపరేషనా లేక తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘దిశ’ తరహా యాక్షనా అన్న అనుమానాలు ప్రజల్లో, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
