క్రైమ్

ప్రాణాపాయంలో రాప్తాడు నిందితుడు హేమంత్.. మరో ఆరోగ్య సమస్య!

 అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై ఎలక్ట్రిక్‌ రంపంతో దాడికి పాల్పడి సంచలనం సృష్టించిన నిందితుడు హేమంత్‌ మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఇప్పటికే కాలు తొలగింపు శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న అతడికి తాజాగా ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే 'పల్మనరీ ఎంబాలిజం' (Pulmonary Embolism) సమస్య తలెత్తినట్లు వైద్యులు గుర్తించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవడంతో అప్రమత్తమైన అనంతపురం సర్వజన ఆసుపత్రి (GGH) వైద్యులు అత్యవసరంగా సీటీ స్కాన్‌ నిర్వహించి ఈ ప్రమాదకర పరిస్థితిని నిర్ధారించారు.