ఏపీ
AP: రాప్తాడు నిందితుడి హెల్త్ సీరియస్.. కర్నూల్‌కి షిఫ్ట్ చేసిన డాక్టర్స్!
AP: రాప్తాడు ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో అమానుష దాడికి పాల్పడి సంచలనం సృష్టించిన నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా సీరియస్‌గా మారింది. తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి డాక్టర్లు షిఫ్ట్ చేశారు.గత 13 రోజులుగా అనంతపురం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హేమంత్‌కు 'పల్మనరీ ఎంబాలిజం' (రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదకర పరిస్థితి) తలెత్తినట్లు వైద్యులు గుర్తించారు. మూడు రోజుల క్రితమే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో అతడు ఆసుపత్రి మంచంపై నుంచి కింద పడిపోయిన విషయం తెలిసిందే.
