సినిమా

#RanabaaliTeaser: రణబాలి టీజర్‌తో ఆ విషయం క్లారిటీ రానుందా?

#RanabaaliTeaser: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడికల్ మూవీ రణబాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్ 16న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇటీవల, మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 9న రణబాలి టీజర్ వస్తుందని ఎక్స్ ద్వారా ప్రకటించారు.