ప్రశ్నించినందుకు కారు మీదకు ఎక్కించి ఈడ్చుకెళ్లాడు (వైరల్)
యాక్సిడెంట్ ఎందుకు చేశావని ప్రశ్నించినందుకు ఓ బీజేపీ కార్యకర్త దారుణానికి తెగబడ్డాడు. అతన్ని కారుతో ఢీ కొట్టడంతో పాటు కిందపడిపోయిన అతని మీద నుంచి కారు ఎక్కించాడు.చక్రాల కింద సదరు వ్యక్తి ఇరుక్కోగా ఆపకుండా అలాగే వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉండే స్థానికులు తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతోంది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మథురలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే..విశాల్ శర్మ అనే బీజేపీ కార్యకర్త ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విక్రాంత్ భారతి అనే వ్యక్తి కారుకు డ్యాష్ ఇచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన విక్రాంత్ భారతి.. కారు దిగి విశాల్ శర్మను వారించాడు.కారు నుంచి కిందకు దిగాలని గొడవ పెట్టుకున్నాడు. శర్మ వాహనానికి అడ్డుగా నిలబడ్డాడు. దీంతో విశాల్ శర్మ అతన్ని కారుతో ఢీకొట్టి తన వాహనం ఎక్కించాడు.
