సినిమా

Ramya Krishnan: బాహుబలి లో శివగామి పాత్ర మైనస్ అయిందా?

Ramya Krishnan: ఒక నటుడికి, లేదా నటికి ఓ గొప్ప పాత్ర రావడం ఎంత అదృష్టమో ఆ పాత్ర తర్వాత వచ్చిన క్రేజ్ నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం అవుతుంది. కొందరికి అదే దురదృష్టంగా మారుతుంది. సీనియర్ నటి రమ్య కృష్ణ పరిస్థితి కూడా ఇలాగే ఉందంటున్నారు ఇండస్ట్రీలోని ప్రముఖులు. కెరీర్‌లో బాహుబలి సినిమా రమ్య కృష్ణకి ఎంతో ప్రత్యేకం. శివగామి పాత్రలో ఒకరకంగా విశ్వరూపం చూపించింది. కానీ, ఇప్పుడు ఆపాత్రే శాపంగా మారిందా?