తెలంగాణ
Ramlila Maidan : రామ్ లీలాలో నిరసనలు కష్టమే.. ప్లాన్ ప్రకారమే సెలెక్ట్ చేశారా?
దేశ వ్యాప్తంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్న సమయంలో కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. జంతర్ మంతర్ కు నిరసన వేదిక హోదాను రద్దు చేస్తూ ఢిల్లీ పోలీసులు మూడు స్థానాలను సూచించిన విషయం తెలిసిందే. అయితే వీటిలో రామ్ లీలా మైదాన్ కు మంచి క్రేజ్ ఉంటుంది. అక్కడ జరిగే ఏ ప్రోగ్రామ్ అయినా దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ నిరసన చేయడం అంత తేలిక కాదని తేలిపోతున్నది. ఎందుకంటే ఇక్కడ నిరసన చేయాలంటే ఒక రోజుకు రూ.1.21 లక్షలు కట్టాల్సిందే.
