తెలంగాణ
Ramchander Rao : బీజేపీ అభ్యర్థుల ఆశలకు షాక్! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలోకి రామచంద్రరావు?
తెలంగాణలో వచ్చే ఏడాది ప్రారంభంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో అప్పుడే హీట్ మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంపై ప్రధాన పార్టీల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఎవరికి వారు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న సమయంలో.. గతంలో ఇదే స్థానం నుంచి విజయం సాధించిన ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును మరోసారి బరిలోకి దింపే అంశంపై పార్టీ పెద్దలు అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
