తెలంగాణ
Ramappa Temple: రామప్పపై సింగరేణి పిడుగు.. 3 టీఎంసీల జలప్రళయం తప్పదా?
కాకతీయ శిల్పకళా వైభవానికి మకుటంలా నిలిచి, అంతర్జాతీయ వేదికపై తెలుగు ఖ్యాతిని రెపరెపలాడించిన రామప్ప గుడికి ఊహించని పిడుగులాంటి వార్త తగిలింది. ఎనిమిది శతాబ్దాలుగా ఎన్నో భూకంపాలను, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా చరిత్ర సృష్టించిన ఈ మహాద్భుత కట్టడంపై ఇప్పుడు సింగరేణి డైనమైట్లు గురిపెట్టాయి. ములుగు జిల్లా వెంకటాపూర్లో సింగరేణి తలపెట్టిన భారీ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు.. పక్కనే ఉన్న చారిత్రక రామప్ప చెరువును పగలగొట్టి, ఆ నీటితో రామప్ప గుడి ఉనికినే శాశ్వతంగా కనుమరుగు చేయబోతోందా అనే భయం ఇప్పుడు యావత్ తెలంగాణను వణికిస్తోంది.
