సినిమా
Ramana Gogula: ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ సెట్ అయితే!
Ramana Gogula: రమణ గోగుల సంగీతం అందించిన సినిమాలలో పవన్ కళ్యాణ్ నటించిన "తమ్ముడు", "బద్రి", "అన్నవరం", "జానీ" సినిమాలకి సంగీతం అందించాడు. 'బంగాళా ఖాతంలో'.. సాంగ్ ఇప్పటికీ వినిపిస్తుంది. మ్యూజికల్‌గా పవన్-రమణ మధ్య మంచి బాండింగ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ సారాంశంలో మళ్ళీ కలిసి వర్క్ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు హింట్ ఇచ్చాడు. 'ఓజీ'లో 'లెట్స్ గో జానీ' సాంగ్ రీమిక్స్ పాడించారు.
