సినిమా

Rajinikanth-Vijay Devarakonda: బాక్సాఫీస్ విన్నర్ సూపర్ స్టారేనా?

Rajinikanth-Vijay Devarakonda: జైలర్ 2 వర్సెస్ రణబాలి..ఈ మాట గత వారం పదిరోజుల నుంచి అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో వినిపించిన మాట. ఒక్కరోజు తేడాతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఒకరు సూపర్ స్టార్, ఇంకొకరు స్టార్. దసరా హాలీడేస్‌ను టార్గెట్ చేసి బరిలోకి దిగారు. అయితే, రజనీ సినిమాకి పాజిటివ్ టాక్.. విజయ్‌ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడం ఒకింత షాకింగ్ విషయం.