సినిమా
Rajinikanth-Dharman: నేటి నుంచి సూపర్ స్టార్ సినిమా ప్రారంభం
Rajinikanth-Dharman: తమిళ సీనియర్ హీరోలలో దూకుడు మీదున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన హీరోగా "ధర్మన్" అనే చిత్రం నేటి నుంచి చిత్రీకరణ ప్రారంభం అయింది. ఈ మధ్యనే "ధర్మన్" నుంచి రజినీ ఫస్ట్ లుక్ విడుదలైంది. దీనికి పెట్టిన ‘ది డెడ్లీ డాక్టర్’ అనే ట్యాగ్‌లైన్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో రజినీకాంత్ డాక్టర్ గా నటిస్తున్నాడు. కీలక పాత్రలో రాశీ ఖన్నా కనిపించబోతోంది. అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేసే విధంగా నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.
