క్రైమ్
యువకుల నిర్లక్ష్యానికి బలైన మెడికో ప్రియాంక మృతి!..
రాజమహేంద్రవరంలో జరిగిన దారుణ ఘటనలో పీజీ మెడికల్ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక కన్నుమూశారు. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆమె.. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కారుతో ప్రియాంకను పలుమార్లు ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచిన ఘటనపై ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు వారికి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. ప్రియాంక మృతితో వైద్య విద్యార్థులు, ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
