తెలంగాణ
మంత్రి పదవిపై హైకమాండ్ మాటిచ్చింది : రాజగోపాల్ రెడ్డి
TG : తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి పదవుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తనకు మంత్రి పదవి విషయంలో అధిష్ఠానం హామీ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి పదవి ఇవ్వడం సీఎం రేవంత్‌రెడ్డి చేతిలో లేదని.. హైకమాండ్ నిర్ణయమే కీలకమని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.తాజాగా మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ వైఖరిపై జరుగుతున్న ప్రచారంపైనా స్పందించారు. మంత్రి పదవి కోసం తాను సీఎం రేవంత్‌రెడ్డితో రాజీపడ్డానని కొందరు ప్రచారం చేస్తున్నారని, అయితే తనకు మంత్రి పదవి ఇస్తామని ఇప్పటికే హైకమాండ్ మాట ఇచ్చిందని పేర్కొన్నారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
