తెలంగాణ
TG: సజ్జనార్‌పై సీబీఐ విచారణ జరిపించండి.. సీఎంకు రాజాసింగ్ సంచలన లేఖ
TG: హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హయాంలో జరిగిన పలు వ్యవహారాలు, అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సంచలన లేఖ రాశారు. సజ్జనార్ పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, ఈ వ్యవహారాలన్నింటిపై సీబీఐతో గానీ లేదా జ్యుడీషియల్ విచారణతో గానీ నిగ్గు తేల్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.తన లేఖలో ప్రధానంగా రెండు సంచలన కేసుల దర్యాప్తు తీరుపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ సీపీ సజ్జనార్ హయాంలో నమోదైన 'గోల్డ్ తెఫ్ట్' కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదని ఆయన ఆరోపించారు.
