National

Raj Thackeray: భారత్‌ను ప్రేమిస్తే దుబాయ్‌లో ఎందుకు ఉంటున్నారు? ఆ ఇద్దరు ప్రముఖ నటులపై రాజ్ ఠాక్రే ఫైర్

ప్రముఖ సినీ నటులు వివేక్ ఒబెరాయ్, మాధవన్ లను టార్గెట్ చేశారు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే. మోదీ ప్రభుత్వాన్ని నిత్యం ప్రశంసించే మీరు ఇండియాలో కాకుండా దుబాయ్ లో ఎందుకు ఉంటున్నారు అని రాజ్ ఠాక్రే వారిని ప్రశ్నించారు. ఓ సినిమాలో మోదీ పాత్రలో నటించిన వివేక్ ఒబెరాయ్ దుబాయ్ వెళ్లారు. ప్రధానిని ఎప్పుడూ కొనియాడే మరో నటుడు మాధవన్ కూడా దుబాయ్ లోనే ఉంటున్నారు. మోదీ భారత్ ను అభివృద్ధి చేస్తుంటే వారంతా ఇక్కడే ఉండొచ్చు కదా అని ఠాక్రే నిలదీశారు.