Raj Gopal Reddy: మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డికి ఆశలు.. ఇంకా ఎందుకు?
Raj Gopal Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి పదవుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేబినెట్లో చోటు దక్కుతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే నిన్న మొన్నటి వరకు సొంత ప్రభుత్వంపైనే, ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డిపైనే బాహాటంగా విమర్శలు చేసిన రాజగోపాల్‌రెడ్డి.. ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ కావడం వెనుక కారణమేంటన్న చర్చ మొదలైంది.మంత్రి పదవిపై హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ రావడంతోనే ఆయన తన వైఖరిని మార్చుకున్నారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై బహిరంగంగానే ప్రశ్నలు సంధించిన ఆయన.. ఇప్పుడు మాత్రం సీఎంతో సన్నిహితంగా కనిపించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో “మంత్రి పదవి కోసమే రాజగోపాల్‌రెడ్డి మెత్తబడ్డారా?” అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
