National
Railway Jobs: డిగ్రీ ఉంటే చాలు.. రైల్వేలో 1,250 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు!
Railway Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తీపి కబురు చెప్పింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన యువత కోసం దేశవ్యాప్తంగా ఏకంగా 1,250 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వే చరిత్రలోనే మొదటిసారిగా ఈ పోస్టులను సాధారణ NTPC నుంచి వేరుచేసి, ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుండటం విశేషం.ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2027 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైతే నెలకు పే లెవల్-6 కింద బేసిక్ పే రూ.35,400తో పాటు ఇతర రైల్వే అలవెన్సులు అందుతాయి.
