క్రైమ్
అబ్దుల్లాపూర్మెట్ ఎమ్మార్వో సుదర్శన్ రెడ్డి ఇంట్లో కొనసాగుతున్న సోదాలు!
రంగారెడ్డి జిల్లా రెవెన్యూ విభాగంలో అవినీతి మూలాలపై యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిన్న రాత్రి నుంచి రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ (MRO) సుదర్శన్ రెడ్డి నివాసంతో పాటు ఆయన కార్యాలయంలోనూ సోదాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. భూముల క్లియరెన్సులు, సర్వేలు, వివిధ ధ్రువీకరణ పత్రాల జారీలో భారీగా ముడుపులు దండుకుంటున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు ఈ ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.
